జాతీయ రహదారుల ప్రయాణికుల కోసం ఎన్‌హెచ్ఏఐ క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మైలు రాళ్లు, టోల్ ప్లాజాల వద్ద ఉండే ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా టోల్ ఫీజు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. గూగుల్ మ్యాప్స్ సమస్యలకు పరిష్కారంగా.. ధ్రువీకరించబడిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించడమే ఈ వినూత్న మార్పు ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు.