హోం శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం.! వంగలపూడి అనిత ఏమన్నారంటే?

10 months ago 28
ఏపీలో పేకాట శిబిరాలు, పోలీసుల చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర డీజీపీని నివేదిక కోరిన అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ ఆదేశించడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నామని.. తమకు ఇగోలు లేవన్నారు. మాకు లేని ఇగోలు మీకెందుకని ప్రశ్నించారు. మంత్రులు ఎవరైనా ఇతర శాఖల అంశాలు తమ దృష్టికి వస్తే సదరు శాఖ మంత్రికి తెలియజేస్తామని.. పవన్ కూడా ఈ అంశాన్ని అలాగే తన దృష్టికి తెచ్చారన్నారు. దీనిని రాజకీయం చేయటం సరికాదని అనిత అన్నారు.
Read Entire Article