గుంటూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రోజున పది బృందాలుగా ఏర్పడి గుంటూరులోని పలు ప్రాంతాలలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల సమయంలో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చేస్తున్న నిర్వాకాలు బయటపడ్డాయి. ఓ రెస్టారెంట్లో చికెన్, మటన్‌ను వారం రోజులుుగా ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఆహారాన్ని తింటే డయేరియా బారిన పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, నాణ్యత లేని పదార్థాలు అందిస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.