హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించింది. హైడ్రా ఈగల్ టీమ్‌గా ట్రాన్స్‌జెండర్ల టీం స్పెషల్ గుర్తింపు పొందింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఈ ట్రాన్స్‌జెండర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో ఈ ట్రాన్స్‌జెండర్లు కూడా పాల్గొన్నారు. ఉద్యోగాలు రావడంతో తమలో ఆత్మవిశ్వాసం వచ్చిందని ట్రాన్స్‌జెండర్లు సంబరపడుతున్నారు.