వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీలో 11 నిమిషాలు ఉండేందుకు వెళ్లారా అంటూ సెటైర్లు వేశారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి సమావేశాలకు వెళ్లాలని... లేకపోతే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అటు గవర్నర్ ప్రసంగంపైనా షర్మిల పెదవి విరిచారు. గవర్నర్ ప్రసంగం మొత్తం అర్ధసత్యాలు, అబద్ధాలేనన్న షర్మిల.. ఉచిత గ్యాస్ తప్ప ఇచ్చిందేమీ లేదన్నారు.