విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయ్ అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ బాలికకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో.. పిన్ని, బాబాయ్ వద్ద ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలోనే ఆ బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు.. ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఆ బాలిక అనారోగ్యానికి గురి కాగా.. ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. గర్భం దాల్చినట్లు డాక్టర్లు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.