స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 15 నుంచి 29 ఏళ్ల యువతకు వీబీవైఎల్‌డీ - 2027 పోటీలు నిర్వహిస్తున్నారు. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ - 2027 పోటీలకు శ్రీకారం చుట్టింది. ఈ పోటీల్లో పాల్గొనే వారు మై భారత్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్తారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవచ్చు.