పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం సగటు ధర కిలోకు రూ. 209.83 పలుకుతోందని ఆయన వెల్లడించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో కిలోకు గరిష్టంగా రూ. 329 ధర పలుకుతోందని.. ఎస్ఎల్ఎస్‌లో రూ. 255, ఎస్‌బీఎస్‌లో రూ. 252 గరిష్ట బిడ్ ఉంటోందని ఆయన చెప్పారు. వేలం పూర్తయ్యే వరకూ రైతులు సహకరించాలని ఆయన కోరారు.