హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలంతో భూగర్భ జలాల్లో స్వల్ప మెరుగుదల కనిపించినా.. గత ఏడాది లోటు కారణంగా ఇంకా అడుగంటే ఉన్నాయి. 2026 ఆగస్టులో సగటు నీటిమట్టం 11.20 మీటర్లకు పడిపోగా.. గత ఏడాది 6.36 మీటర్లుగా ఉంది. కుత్బుల్లాపూర్‌లో ఏకంగా 39.89 మీటర్ల లోతు నమోదైంది. లోటు వర్షపాతం, వర్షపు నీటి రీచార్జ్ లోపాలు పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. అయితే మేతో పోలిస్తే ఆగస్టులో 0.80 మీటరు పెరుగుదల నమోదైంది. 11 మండలాల్లో నీటిమట్టం ఇంకా 20 మీటర్లకు మించి లోతులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.