వైఎస్ షర్మిల - అనిల్ కుమార్ కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని షర్మిలనే నేరుగా వెల్లడించారు. అమెరికాలో స్థిరపడిన కర్నూలుకు చెందిన సోమల సుబ్బారెడ్డి, పద్మారెడ్డి కుమారుడు డాక్టర్ రఘురామరెడ్డితో పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అన్న వివరాలు మాత్రం ఆమె వెల్లడించలేదు. కూతురు ఫొటోతో పాటు కాబోయే అల్లుడి ఫొటోను కూడా పోస్ట్ చేశారు.