పీజేటీఎస్ఏయూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. గరిష్ట వయస్సు 45 ఏళ్లకు మించకూడదని తెలిపారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.