వేసవి రాగానే తాటి ముంజల రుచి చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లేతగా, తియ్యగా ఉండే వీటిని 'ఐస్ ఆపిల్' అని కూడా అంటారు. ఇది శరీరానికి చల్లదనాన్నివ్వడమే కాకుండా, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్రత్యేకమైన రుచిని విదేశీయులు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మువ్వా రమేశ్ అనే పారిశ్రామికవేత్త ఈ డిమాండ్‌ను ఒక వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు.