మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడిన కేసీఆర్.. గతంలో తాము టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించాలనే.. 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపైనా కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దానిపై సభలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మౌనంపైనా మండిపడ్డారు.