TGPSC Legal Appeal Group 2 2015: తెలంగాణలో పోటీ పరీక్షల నిర్వహణపై గందరగోళం కొనసాగుతోంది. పదేళ్ల క్రితం జరిగిన గ్రూప్ 2 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో టీజీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. వైట్‌నర్ వాడకం ప్రధాన వివాదంగా మారడంతో, అప్పటి అభ్యర్థుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లిన తర్వాతే ఫలితాలు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు.