ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీసీఎస్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే విక్రయించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు దీనికి సంబంధించిన పేపర్ క్లిప్‌ను నెట్టింట వైరల్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ నిజంగానే చంద్రబాబు సర్కార్.. టీసీఎస్‌కు వేల కోట్ల భూములను అంత తక్కువకు అమ్మిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.