తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రైవేటు భూ యజమానులకు ఇబ్బందులు రానివ్వబోమని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులు నిషేధిత భూములపై పరిశీలన చేపడుతారని అన్నారు. భూమి ప్రైవేటుదిగా నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. 22ఏ జాబితాను కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. దళారులను నమ్మవద్దని ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.