అనకాపల్లి: ఇళ్ల సందులోకి దూరిన 13 అడుగుల గిరినాగు.. బెంబేలెత్తిపోయిన జనం..

1 hour ago 2
అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు కలకలం రేపింది. రెండు ఇళ్ల మధ్యన ఉన్న సందులో ప్రత్యక్షమైన గిరినాగు స్థానికులను బెంబేలెత్తించింది. దేవరాపల్లి మండలంలోని గరిసింగి గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గిరినాగును గుర్తించిన స్థానికులు అటవీశాఖ సిబ్బంది సమాచారం అందించారు. వారి ద్వారా సమాచారం అందుకున్న తూర్పు కనుమల సంరక్షణ సమితి సభ్యులు, రెండు గంటలపాటు శ్రమించి గిరినాగును బంధించారు. అనంతరం సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.
Read Entire Article