పొగాకు రైతులకు మరింత మంచి ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం రోజున పొగాకు కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పొగాకు బోర్డు అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు మెరుగైన ధర లభించేలా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కంపెనీలు, ట్రేడర్లతో చర్చించి కొనుగోళ్ల పరిమాణం పెంచాలని స్పష్టం చేశారు.