22ఏ జాబితాలో ప్రైవేటు భూములు.. ఈ జిల్లాల్లోనే ఎక్కువ, యజమానులకు రిజిస్ట్రేషన్‌ చిక్కులు

1 hour ago 1
తెలంగాణలో మూల సర్వే నంబర్ల పొరపాట్ల వల్ల ప్రైవేటు, పట్టా భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేరి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆయా ఆస్తుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో యూఎల్‌సీ, క్రమబద్ధీకరించిన స్థలాలు, పట్టా భూములు మూల సర్వే నంబర్లతో కలిసిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో జిల్లాల్లో పునఃపరిశీలన చేపడుతున్నాయి. బాధితులు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే రికార్డులను అనుసంధానించి తప్పుగా చేరిన ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article