రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చేస్తున్న మెడికో ప్రియాంకను ఆగస్టు మూడో తేదీన ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. ఆదిత్య మాల్ గేట్ వద్ద కారుతో మూడుసార్లు ఢీకొట్టడమే కాకుండా ఆమెపై నుంచి కారు పోనించడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికంగా చికిత్స అనంతరం సికింద్రబాద్‌కు తీసుకెళ్లగా ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్‌ని నియమించింది.