ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ నెలలో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ నెల 20న ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను విడుదల చేయనున్నారు.