హైదరాబాద్ పాతబస్తీ మెట్రో ప్రాజెక్టుకు భూసేకరణ సంబంధిత న్యాయపరమైన అడ్డంకులు తొలగుతున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో రహదారిని 100 అడుగులకు పైగా విస్తరించేందుకు భూసేకరణ చేపట్టారు. 600కు పైగా భవనాలు, మల్గీలను తొలగించి పలువురికి పరిహారం చెల్లించారు. భూసేకరణపై దాఖలైన పిటిషన్‌లో స్టే ఇచ్చిన హైకోర్టు, అనంతరం ప్రభుత్వం అభ్యర్థనపై మెట్రో పనులు, భూసేకరణ కొనసాగించేందుకు అనుమతించింది. అయితే ఆస్తులు కోల్పోయిన వారు ప్రాంతాల వారీగా న్యాయమైన పరిహారం, సకాలంలో చెల్లింపులు చేయాలని కోరుతున్నారు.