తెలంగాణలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానాన్ని తొలిసారిగా అమలు చేయనున్నారు. మూడు దశల్లో 18,472 కిలోమీటర్ల రహదారులను నిర్మించి, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 2,145 రహదారులకు సంబంధించి 7,448 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నారు. 176 గ్రామపంచాయతీలకు 934 కిలోమీటర్ల కొత్త బీటీ రోడ్లు, 5,490 కిలోమీటర్ల పాత రోడ్ల ఆధునికీకరణ, 1,024 కిలోమీటర్ల సింగిల్ లేన్ రోడ్ల విస్తరణ జరగనుంది. తొలి దశలో 3,036 గ్రామపంచాయతీలు లబ్ధి పొందనున్నాయి.