25 ఏళ్ల క్రితం కేసీఆర్ వేసిన ఒక్క అడుగు తెలుగు రాజకీయాలను ఊహించని మలుపు తిప్పింది. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా మారింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ.. మరింత విస్తరించే లక్ష్యంతో తన పేరు మార్చుకొని బీఆర్ఎస్‌గా మారింది. కానీ ఇప్పుడు తెలంగాణలోనే కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. కవిత రూపంలో ఆ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది.