తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ డీజీగా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బాధ్యతలను వీసీ సజ్జనార్ గురువారం స్వీకరించారు. 26 ఏళ్ల సర్వీసులో 20 పోస్టింగ్లు వచ్చాయని.. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వాటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. అగ్నిప్రమాదాల సమయంలో రెస్పాన్స్ టైమ్ తగ్గించడం, ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, ప్రభుత్వ ఆస్తుల భద్రతను పటిష్ఠం చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.