దిశ మార్చుకుని దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తెలంగాణకు 2 రోజులు వర్ష సూచన

2 hours ago 1
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను దిశలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజా అంచనాల ప్రకారం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను సముద్రంలోనే బలహీనపడే సూచనలు ఉండటంతో గాలుల తీవ్రత తగ్గవచ్చని సమాచారం. దీని ప్రభావంతో తెలంగాణలో గురువారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శుక్రవారం తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో పాక్షికంగా ఎండతో పాటు చలి ప్రభావం ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్ష సూచన ఉండటంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article