హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండలాలను సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో విభజించడంతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను తిరిగి కరీంనగర్‌లో కలపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 2023 ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ ఈ హామీ ఇచ్చారు. తాజాగా సిద్దిపేట పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేశారు.