2BHK ఇళ్ల తనిఖీల సమాచారం లీక్.. హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై సస్పెన్షన్ వేటు

2 hours ago 3
తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న డీఈఈ చంద్రపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు నిజంగా నివసిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ సమాచారాన్ని చంద్రపాల్ ముందుగానే లబ్ధిదారులకు చేరవేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సమాచారం లీక్ అయినట్లు నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article