అనంతపురం జిల్లాలో పంచాయతీ రాజకీయాలైతే మరో లెవెల్లో ఉన్నాయి. బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి టెండర్ తరహాలో ఎంపిక చేశారు. ఎక్కువ డబ్బు బిడ్ వేసిన వ్యక్తికి ఆ పదవి సొంతమైంది. విశేషమేమిటంటే గతంలోనూ నక్కలపల్లిలో రూ.21 లక్షల విరాళంతో ఇలాగే సర్పంచ్‌ను డిసైడ్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక్కడే ఎన్నికల కంటే ముందే ఇలా పదవిని 'ఫిక్స్' చేసుకోవడం చట్టబద్ధమేనా? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. గ్రామాభివృద్ధి ముసుగులో జరిగిన ఈ 'టెండర్' ఎంపిక విధానం ఇప్పుడు విమర్శలకు కేంద్రం అయింది.