అక్వాన్ తుఫాన్ ముప్పుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ గండాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ సిబ్బంది అంతా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ.. వారిని ఏం జరగక్కుండా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.