రిపబ్లిక్ డే వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటానికి మరో గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శించిన శకటాల పరేడ్‌లో తృతీయ బహమతి దక్కించుకుంది. యూపీ, త్రిపురలకు మొదటి రెండు బహుమతులు దక్కగా.. ఏపీ శకటం మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు.