ఖమ్మం రైల్వే స్టేషన్ పరిసరాల్లోని రద్దీ సమస్యను పరిష్కరించడానికి ఖమ్మం ఎంపీ చొరవ తీసుకున్నారు. రైల్వే స్టేషన్ ఎదుట రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా జరుగుతున్నాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం .. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని అనేక రైల్వే స్టేషన్లలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.