September 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పాలనకు ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీఎం.. రైతు రుణమాఫీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డులు వంటి పథకాలను వివరించారు. 30 వేల ఎకరాల్లో దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. సామాజిక న్యాయం, విద్య, వైద్యం, ఉద్యోగాలు, తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.