భార్యాభర్తల విషయంలో వచ్చే చిన్న చిన్న గొడవలు.. చాలాసార్లు మాటలతోనే ఆగిపోతాయి. కొన్నిసార్లు హద్దు దాటి చేతల వరకూ వస్తుంటాయి. కానీ.. కొన్నిసార్లు క్షణికావేశాల్లో బౌండరీలు దాటేసి.. కోపావేశంలో ఎదుటివాళ్లను చంపేయటాలో, లేక మనస్థాపాలతో తమను తాము బలవంతంగా ప్రాణాలు తీసుకోవటాలో జరుగుతుంటాయి. అచ్చం అలాంటి దుర్ఘటనే జరిగింది హైదరాబాద్ మిమాపూర్ పరిధిలో. ఆరు నెలల చిన్నారికి తినిపించే విషయంలో వచ్చిన గొడవ.. ఆ ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.