ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు పుట్టుకొస్తున్నాడంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్కూలులో మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. దీనికి స్పందించిన నారా లోకేష్ వారికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్కూలులో పొరబాటు జరిగితే.. లోకేష్ బాధ్యత తీసుకున్నారంటూ నాగబాబు ప్రశంసించారు.