Srikakulam Neradi Barrage New Dpr: ఉత్తరాంధ్రవాసులు, ముఖ్యంగా శ్రీకాకుళ జిల్లావాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేరడి బ్యారేజి నిర్మాణానికి ఇటీవల అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వం నేరడి బ్యారేజీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలో తొలి అడుగు పడింది. తాజాగా నేరడి బ్యారేజీకి సంబంధించి రూ.70 కోట్లతో కొత్త డీపీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అలాగే ఒడిశా ప్రభుత్వానికి కూడా త్వరలో లేఖ రాయనున్నారు.