తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆలస్యానికి కారణం.. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారమేనని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసిందని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన కూడా భారీ స్థాయిలోనే అప్పుడు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే.. ఏకంగా సుమారు 76 వేల కోట్లు అప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో చిట్టా పద్దు మొత్తం పెట్టారు.