ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సేవల విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసే ఆలోచనలో ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను బీమా విధానంలో అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ ఒకటి నుంచి బీమా విధానంలో ఆరోగ్య సేవలు అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విధానంలో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పరిధిలోని 1.43 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వమే కుటుంబానికి రూ.2500 చొప్పున ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు.