తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకి హన్సిక మౌత్వానీ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో భర్త సోహైల్ ఖతురియాతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.