ప్రేమ, పెళ్లి.. ఎవరూ ఊహించనిది. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పలేం. రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో వింటూనే ఉంటాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ రూమర్స్ కామన్. అయితే రాజకీయ నేతలు, సినీ తారలను ప్రేమించడం మాత్రం సినిమాల్లోనే చూస్తుంటాం. 18 ఏళ్ల క్రితం ఇలాంటి సీక్రెట్ లవ్ స్టోరీ ఒకటి నడిచింది. వారు రహస్యంగా పెళ్లి చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో, కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది.