వెబ్ సిరీస్‌లు 'షీ', 'ఆశ్రమ్' లలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి అదితి పోహంకర్. అయితే తాజాగా ఆమె తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్ననాటి చేదు అనుభవాలను గురించి వివరించారు. స్కూల్ బస్సులో తాను ఎలా లైంగిక వేధింపులకు గురయ్యానో వెల్లడించారు.