ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ సినిమా ఓటీటీకి వచ్చేస్తుంది. అప్పుడెప్పుడో 2015లో అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని వారసుడు ఇప్పటివరకు సాలిడ్ హిట్టు కొట్టలేదు. ఆ మధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కాస్త పర్వాలదనిపించినా.. కమర్షియల్‌గా ఆహా అనే రేంజ్‌లో మాత్రం లాభాలు తీసుకురాలేదు.