Telangana CM Revanth Reddy: తెలంగాణలో వర్షాభావం, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల పంటలు చేతికొచ్చే వరకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, రాబోయే 20 రోజులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే జూన్ వరకు అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు, గ్రామసభలు, కళాజాతల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.