పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చర్చిలకు అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని మాజీ ఎంపీ హర్షకుమార్ తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రతీకార కోణంతో వ్యవహరించకూడదని సూచించారు. పెదపేటలోని ఓ చర్చికి నోటీసులు ఇచ్చారన్న హర్షకుమార్.. తరతరాలుగా ఉన్న చర్చికి రికార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆ చర్చిలో రెండేళ్లకు ఓసారి పాస్టర్లు బదిలీ అవుతుంటారని.. వారి వద్ద రికార్డులు ఉన్నాయో లేవో తనకు తెలియదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే 71 చర్చిలకు నోటీసులు వెనక్కి తీసుకోవటాన్ని ఆయన స్వాగతించారు.