Allu Arjun Case: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని లాయర్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొనడం ప్రస్తుతం ఈ వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పటికే తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లగా.. మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో తిరిగి బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మళ్లీ జైలుకు వెళ్తారని లాయర్ పేర్కొనడం సంచలనం రేపుతోంది.