ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఒక ఫిలిం స్టార్ అని.. పైసలు పెట్టి సినిమాలు తీస్తు డబ్బులు సంపాదిస్తూ.. వ్యాపారం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయనేమీ ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి యుద్ధం చేసి.. భారత్‌ను గెలిపించాడా అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని.. ఆయనకు పిల్లనిచ్చిన మామ కూడా తనకు బంధువేనని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. తాను ఓ స్టార్‌నేనని.. తనకు ఫ్యాన్స్ ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.