తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్‌చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ 10 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది.