వాళ్లిద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు. 30 సంవత్సరాల కిందట ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి మరీ వివాహం చేసుకున్నారు. వాళ్లకి నలుగురు కుమార్తెలు.. ఒకరికి వివాహం కూడా అయింది. అయితే, 58 సంవత్సరాల భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు అన్న అనుమానంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఇద్దరూ గొడవపడటం.. భార్య కోపంతో భర్త పీక కోసి చంపేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.