Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలను కలిసినట్లు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ కలవలేదని.. ఆ విషయం తెలుసుకున్న ఆయన చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిపారు.