తెలుగు చిత్రసీమలో "ఐకాన్ స్టార్"గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అల్లు అర్జున్‌కి ఇప్పుడు కొత్త వివాదం ఎదురైంది. చదువును వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కళాశాలలకు ప్రచారం చేస్తూ... విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ఆరోపిస్తూ AISF (All India Students Federation) తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది.